Monday, May 16, 2016

అరుణోదయం

కళ్ళు తెరిచేసరికి  అంత చీకటిగానే ఉంది, ఉదయమా రాత్రా కూడా తెలియటం లేదు , లేచి గడియారం  చూడటానికి కూడా ఓపిక లేదు, మొబైల్ కోసం పక్క అంత తడిమాను కాళ్ళ దగ్గర ఉంది మెల్లగా చేతిలోకి తీస్కోని టైం చూసాను తెల్లవారి నాలుగు అవుతుంది. రాత్రి తాగింది దిగగానే మెలుకువ రావటం, తరువాత సున్యం లోకి చూస్తూ ఆలోచనల సుడిలోకి ప్రయాణం నాకు అలవాటే.

చిన్నప్పుడు హర్షా గాడితో గడిపిన రోజులు గుర్తొచ్చాయి, మా ఊరు ఒక టౌన్, చుట్టూ పక్కల గ్రామాలకి అదే సెంటర్. హర్ష గాడిల్లు యేరుకి అనుకోని భలే ఉండేది, యేరు ఎందినప్పుడు అదే మా క్రికెట్ గ్రౌండ్. కొత్త బ్రిడ్జి పనులు పూర్తవక పోవడం వలన , తెప్పల లోనే పక్క ఊరివాళ్ళు వచ్చేవారు .

హర్షా గాడికి  నాకు సినిమాలంటే  పిచ్చి. ఒక సైకిల్, 10 రూపాయిలు, ఒక సినిమా, వారానికి మూడు సినిమాలైన చూసేవాళ్ళం. సినమాలు వాటి గురించి మాట్లాడుకోవడమే మా దినచర్య. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏది వోదిలేవాళ్ళం కాదు. రాను రాను మిగతా స్నేహితులకి కథలు చెప్పడం రివాజుగా మారింది, దానిమీద ఆశక్తి పేరిగింది, ఇద్దరం కథలు అల్లి మరీ చెప్పేవాళ్ళం . జనాలు ఆసక్తిగా వింటుంటే ఏదో తెలియని కిక్ ఉండేది. మేం ఇద్దరం అంటే ఎవరు నమ్మే వారు కాదు, ఇష్టాలు చేసే పనులు, రుచులు అన్ని ఒకటీ.

ఒక రోజు గాలి వాన హోరున వస్తుంది. నాన్నగారు ఇంకా రాలేదు\ అమ్మ కంగారు పడుతుంది. వరండ లో ఎదురు చూస్తున్న అమ్మ కళ్ళల్లో నవ్వు కనపడింది, నాన్నగారు వచ్చారు. కాని నాన్న మొఖం లో నవ్వులేదు, నన్ను చూసి లోపలికి వెళ్లి చదువుకో నాన్న అని చెప్పి, అమ్మ తో ఏదో మాట్లాడుతున్నారు . నా దగ్గర ఏదో దాస్తున్నారు అనిపించింది. కాసేపటికి అమ్మ వచ్చి, వర్షాలు బాగా పడుతున్నాయి ఈ వారం రోజులు స్కూలు, ఇల్లే నాన్న ఎక్కడికి వేళ్ళకు అని కొంచెం గట్టిగానే చెప్పింది . నాన్న ఇంకా ముబవంగానే ఉన్నారు.

ఇంటికి రాగానే నన్నే ముందుగా హత్తుకునే నాన్న ఎందుకు అల ఉన్నారో అర్ధం కాలేదు, ధైర్యం చేసి "నాన్న ఎందుకు అలా ఉన్నారు" అని అడిగేశాను\, నాన్న కంటిలో నీటి పొర, నాన్న ఏడవటం చూడటం అదే మొదటిసారి, వంటిట్లో అమ్మ కూడా ఒక్కసారిగా కన్నీళ్ళ పర్యంతం అయిపోయింది. నాకు ఏమి అర్ధం కావటం లేదు, అమ్మ వచ్చి "హర్షా తెప్ప మునిగి చనిపోయదంట నాన్న " అని నన్ను గట్టిగ పట్టుకొని చెప్పింది.

ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూశాను, అరుణ లేచినట్టుంది వంట గదిలో నుంచి శబ్దం వస్తుంది, తల పగిలి పోతుంది కాఫీ అడగాలి అనిపించిది, కాని మేము మాట్లాడుకొని చాల రోజులవుతుంది. లేచి కిచెన్ కి వెళ్లేసరికి తన కప్ లో పోసుకున్న కాఫీ అక్కడే వొదిలేసింది, నాకే కొబొలు. తన ఆఫీసు షిఫ్ట్ 11 కి అవుతుంది, సో రోజు కొంచెం లేట్ గానే లేస్తుంది. ఈరోజు ఎందుకు ఉదయమే లేచిందో తెలియదు.

నా కెరీర్ ఇనిషియల్ డేస్ తరువాత ఇట్ నెవెర్ టేక్ ఆఫ్ , సో, ఫమిలీ  నీడ్స్ కోసం తను జాబు జాయిన్ అయ్యింది, మొదట్లో కొంచెం అవమానంగ అనిపించినా నాకు దొరుకుతున్న ఎక్స్ట్రా స్పేస్ వాల్ల అడ్జస్ట్ అయిపోయా . అరుణ వాదన  "ఐ నెవెర్ బెలొంగ్స్ హియర్' అని, కార్పొరేట్ కోలాహలం నాకు చేతనవదు అని, అలా అన్నపడల్లా చాల ఇర్రిటెటింగ్ గా అనిపించేది, అలా చాల సార్లు గొడవలయ్యి ఇదిగో ఇప్పుడిలా ఈ నిశబ్దం.

నిజమే 'డస్ ఐ బెలొంగ్స్ హియర్'.
హర్షా గాడు పోయిన చాల రోజుల వరకు నాకేమి తోచేది కాదు, ఊర్లో కూడా అందరు నన్ను ఓదార్పు గ చూసేవారు, సినిమా నే మర్చిపోయాను పోస్టర్ చూసిన వాడి జ్ఞాపకాలే. కొన్నాళ్ళకి నాన్నకి పొరుగూరు ట్రాన్స్ఫర్ అయింది. అది మా తాతయ్య వాళ్ళ ఊరు, అమ్మ వాళ్ళది ప్రేమ వివాహం కావడం తో రాకపోకలు కొంచెం తక్కువే కానీ అదే ఊర్లో చేరేసరికి అందరు కలవటం మొదలయ్యింది, దీంతో మా వాళ్ళతోనే కొత్త గ పరిచయం అవ్వటం, కోసిన్స్ తో ఆటలు, పండగల వల్ల కాలం రోజులు సంవత్సరుల్గా గదిచిపోయింది.

కానీ అప్పటి దాక నేను, హర్షా, సినిమా గా ఉన్న నాకు పోటి  పరిచయం అయ్యింది, చదువు పోటీ, ఉద్యోగ పోటీ, శాలరీ పోటీ. పోటీ పడినంత వరకు ఆట బాగుందనిపించింది కానీ పోటీ ఎప్పుడు ముగిసిందో తెలియదు నాలో తెలియని నీరసం, సిటీ ఒంటరితనానికి అడపా దడపా రాసుకునే కొన్ని కథలు, చిన్నప్పటి ఆలోచనలు, రోజు తాగే మందే ఊరట. ఈలోపు పెళ్లి పోటి కూడా మొదలయ్యి ఆ తంతు జరిగిపోయింది.

ఆఫీసుకి  రెడీ అయ్యాను, అరుణ సోఫా లో కూర్చొని ఏదో రాస్తుంది. నా కంటి ఎప్పుడు అందంగా కనిపించే తను ఇంకా అందంగా కనిపిస్తుంది. ఈరోజు హాలిడే కాదు సెలవు పెట్టిందేమో అనుకుంటూ గుమ్మం వైపు కదిలాను, లేచి నా  వైపు చూడకుండానే ఆ కాగితం నాకందించింది.

కాగితం లో ఒక అడ్రస్ ఉంది, కిందన "అక్కడ నాక్కావాల్సిన వ్యక్తిని  మీరు కలవాలి అనుకుంటున్నా " అని రాసుంది. ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా తెలియలేదు, ఎవర వ్యక్తి నేనెందుకు కలవాలి.  తను నాతో మాట్లాడక పోయిన, నేను తననుంచి దూరం వెళ్ళాలి అనుకోలేదు, ఇప్పుడు తను నాకు దూరం కాబోతుంద. అడ్రస్ మళ్ళీ చూసాను, ఆఫీసు వెళ్ళే దారిలోనే ఆ అడ్రస్ కి చేరుకొనే ఈ కొంత దూరం నాకు చాల భారంగా మారింది కాని వెళ్ళాలి, ఎవర్ని కాలవలో త్వరగా తెలుసు కోవాలి.

అడ్రస్ దగ్గరకి వచ్చాక. కాగితం లో నెంబర్ కి కాల్ చేసాను,
"రఘూ గారా, త్వరగా రండీ, సార్\మీకోసమే వైట్ చేస్తున్నారు" అన్నారు,
గేటు దగ్గర ఉన్నానని చెప్పాను. గేటు తీస్కోని లోపలికి వెళ్లేసరికి ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి అనుకుంట గేటు నుంచే ఆహ్వానిస్తూ లోపలి తీసుకు వెళ్లి ఒక విశాలమైన గది లో కుర్చోపెట్టారు, వైట్ చెయ్యండి సార్ 5 మినిట్స్ లో వస్తారని చెప్పి వెళ్ళాడు, గది అంత చూసాను, ఎదురుగా ఫోటో లో బాగా తెలిసిన వ్యక్తి కనిపిస్తున్నారు, అవును  ఆయన న ఫేవరెట్ డైరెక్టర్ సాగర్ నమ్మలేకపోతున్నా.

నేనింకా ఆశ్చర్యం లోనే ఉన్నాను, సార్  లోపలికి వచ్చారు. వస్తూనే చిన్న చిరు నవ్వుతో పలకరించి సోఫా లో కూర్చున్నారు, నా ఇన్బాక్స్ లో సగం ఈమెయిల్సు నీవే, నీ కథలన్నీ చదివానయ్య చాలా బాగున్నాయి. నేనేంటి ఈమెయిల్సు ఏంటి, నా ముందే నా చైల్డ్హుడ్ హీరో కూర్చొని కథలడగడం ఏమిటి అంతా అయోమయంగా ఇంతలో whatsapp బజ్ అయ్యింది అరుణా నుంచి "ఆల్ ది బెస్ట్" అని మెసేజ్ పెట్టింది, అప్పుడే అర్ధం అయ్యింది నాకు తెలియకుండా తనే నా  కథలన్నీ పంపించిందని.

నా కథల్లో ఆయనకి నచ్చిన కథని నరేట్ చెయ్యమన్నారు, హర్షా గాడు గుర్తొచ్చాడు కొండంత బలం వచ్చింది, వాడి తరువాత నన్ను నేను చాల కోల్పోయాను అని అనిపించింది ఆ క్షణం. కథ చెప్పడం మొదలుపెట్టాను, ప్రతీ పాత్ర కి ప్రతీ సన్నివేశానికి నాలోని  ఉత్సాహం పెరుగుతుంది, చాల రోజుల తరువాత అంత ఎక్సైట్ అవ్వడం, నాకు నేనే కొత్తగా పరిచయం అవుతున్న మళ్లీ , అరుణ కలవమన్నది నాతో నన్నే అని నాకు అర్ధం అయ్యింది. సాగర్ గారు చప్పట్లు కొట్టి, నేను కంబ్యాక్ ఈ కథ తోనే చెయ్యబోతున్న నాతో కలిసి పనిచేస్తావ అని అడిగారు, నా కళ్ళల్లో అనంధబాష్పలె సమాధానంగా చెప్పి వచ్చేసా.

మళ్లీ అదే దూరం ఇంటికి వెళ్ళాలి, క్షణం లో అరుణ ముందు  ప్రత్యక్షం అవ్వాలని ఉంది. ఇంటికి చేరాను, అరుణ గుమ్మం దగ్గరే నాకోసం వెయిట్ చేస్తుంది. ఆ రోజు హోరు గాలిలో నాన్నగారికి ఆలస్యం అయి వచినప్పుడు, అమ్మ కంటిలో కనిపించిన ఆ నవ్వు ఈ రోజు అరుణ కళ్ళల్లో చూసాను.




















No comments:

Post a Comment