Sunday, March 7, 2010

మనిషికి మనిషికి మధ్య అడ్డుగోడల సమాజం ఇది

నమ్మలేని నిజం
ఇది నమ్మలేని నిజం

యువతరం కులం మతం అంటోంది
భావితరం జాతి జాతి అంటోంది
నిజం నిజం ఇది నమ్మలేని నిజం

ముందు తరాల సిగ్గులేని తనాన్ని
స్వార్ధ పూరిత హస్తాలతో
రేపు అనే భావిష్యతుకి మోసుకెల్తుంది
నిజం నిజం ఇది నమ్మలేని నిజం

మనిషికి మనిషికి మధ్య అడ్డుగోడల సమాజం ఇది
'నా''మన' పదాలు మనం ను వెక్కిరిస్తున్నై
నిజం నిజం ఇది నమ్మలేని నిజం

నవ తరం ,రేపటి తరం
స్వార్ధ బాట పడుతుంది
నిజం నిజం ఇది నమ్మలేని నిజం

సమాన్యుడ్ని నేను

సమాన్యుడ్ని నేను
గుండె నిండా ఆశల తో రేపు అనే లక్ష్యం తో
ఆగి పోనీ కాలం తో పరుగు తీసే గమనం తో
పయనించే సమన్యుడ్ని నేను...

చంటి పాప నవ్వుల తో వేనేల్లమ్మ అందాల తో
పిల్ల గాలి స్పర్సల తో కోకిల్లమ్మ గానాలతో
ఆనందించు సమాన్యుడ్ని నేను ...

విషసర్పాల నీడల్లో పెచ్చరిల్లు హింస తో
ఉగ్రవాద వినయసాల తో స్వపాలన పరిహాసం తో
విలపిస్తున్న సమాన్యుడ్ని నేను ...

జగమెరిగిన సమాన్యుడ్ని ..కపటలకి బలియ్యే అసహయుడ్ని
నేను సమన్యుడ్ని , అలపెరుగని ధీరుడని
కాన రాణి లోకం కై ఎదురుచూస్తున్న వీరుడ్ని ...

Wednesday, January 20, 2010

దేశం అంటే బలం కాదు ధనం కాదు

లేదా నీలో చేవ లేదా నీలో సత్తువ
లేచి ర కళ్ళు తెరిచి చూడ లేవ...
కాన లేవ కుళ్ళు ...తియ్యలేవ ముళ్ళు ...

ఎటు చూడు బలం వీరంగం ఆడుతుంది ...కనిపించే ప్రతిచోట ధనం విజయత్తహాసం చేస్తుంది...
చూస్తూనే ఉంటావా ...రగిలి పోయే గుండెను ...'నేను' అనే పంజరాన ఆపెస్తావ

లేదా నీలో చేవ లేదా నీలో సత్తువ
లేచి కళ్ళు తెరిచి చూడ లేవ...
కాన లేవ కుళ్ళు ...తియ్యలేవ ముళ్ళు ...

మరో ఉదయం మరో ప్రపంచం ..నీకోసం చూస్తుంది
నవసమాజ నిరమానానికి కాలేవా పునాది ...
తెలుసుకో,నీవు లేక ధనం లేదు నీవు లేక బలం లేదు ...
దేశం అంటే బలం కాదు ధనం కాదు , జనం